మున్సిపల్‌ కార్యాలయంలో విద్యుత్‌ వృథా | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్యాలయంలో విద్యుత్‌ వృథా

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

సిబ్బంది లేకపోయినా వెలుగుతున్న

లైట్లు, తిరుగుతున్న ఫ్యాన్లు

విద్యుత్‌ను ఆదా చేయాల్సిన మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్‌ కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ విభాగంలో అవసరం లేకపోయినా ఫ్యాన్లు, లైట్లు ఆన్‌లో కనిపించాయి. కార్యాలయ గదుల్లో సిబ్బంది లేకపోయినా విద్యుత్‌ పరికరాలు పనిచేస్తుండటంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ చార్జీలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఖచ్చితంగా పొదుపు చర్యలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, ఆదిలాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement