శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్లను జూన్‌లోగా నెరవేర్చని పక్షంలో మెరుపు సమ్మె చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ తెలిపారు. మంగళవారం రాత్రి సీసీసీ కార్నర్‌లోని నరసయ్య భవన్‌లో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నూతన గనులను ప్రారంభించాలని, మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని, మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు, హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ ప్రధా న కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.


