తాండూర్: మండలంలోని చౌటపల్లి గ్రామపంచా యతీ పరిధిలో పీఎం అజయ్ పథకం ప్రాజెక్ట్ పనులు సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్ర య్య సూచించారు. మంగళవారం చౌటపల్లి గ్రామపంచాయతీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీఎం అజయ్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, మురుగుకాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆయన వెంట చౌటపల్లి సర్పంచ్ ముదాం సునీత, డీఎల్పీవో సతీశ్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో అనిల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి వసంత ఉన్నారు.


