మంచిర్యాలఅగ్రికల్చర్: పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల అదనపు వి.రాములు సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా బాల పరిరక్షణ విభాగం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్‌మెంట్ కేసెస్‌పై అవగాహన కార్యక్రమానికి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా వైద్య, ఆరో గ్యశాఖ అధికారి అనిత, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కౌమార దశలో పిల్లల్లో ఏర్పడే మా ర్పులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ, ఎల్లోప్ మెంట్ కేసులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.


