క్రీడలూ ముఖ్యమే.. | - | Sakshi
Sakshi News home page

క్రీడలూ ముఖ్యమే..

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

శ్రీరాంపూర్‌: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమేనని శ్రీరాంపూర్‌ జీఎం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌ ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. 25రోజు ల పా టు శిక్షణ శిబిరం కొనసాగుతుందని తెలిపా రు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొ ని రాణించాలని సూచించారు. సెలవుల్లో సె ల్‌ఫోన్లు పట్టుకుని సమయం వృథా చేయరా దని తెలిపారు. మైదానంలో ఆటలు ఆడడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల్లో శా రీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాని కి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయ ని చెప్పా రు. ఏరియా ఎస్వోటూ జీఎం ఎన్‌.సత్యనారా యణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, డీజీఎం (పర్సనల్‌) అనిల్‌కుమార్‌, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, స్పోర్ట్స్‌ గౌరవ కార్యదర్శి పాల్‌సృజన్‌, కోఆర్డినేటర్‌ నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement