మ్యాపింగ్‌ జాప్యం! | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ జాప్యం!

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

● జిల్లాలో ఇప్పటికీ 64శాతమే పూర్తి ● ‘సర్‌’కు ముందు పూర్తికాని ప్రక్రియ ● స్థానికంగా లేని ఓటర్లతో తిప్పలు ● బయటపడుతున్న ‘డబుల్‌’ ఓట్లు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కోసం చేపట్టిన ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ జిల్లాలో ఆశించిన మేర ముందుకుసాగడం లేదు. గత నాలుగు నెలలకుపైగా సాగుతున్నా.. ఇంకా 70శాతం ప్రక్రియ కూ డా పూర్తి కాలేదు. దేశ వ్యాప్తంగా సమగ్ర ఓటర్ల జా బితా కోసం ఎన్నికల కమిషన్‌ ప్రతీ 25 ఏళ్లకోసారి సర్వే చేయడం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో సర్వే నిర్వహించగా ప్రస్తుతం మళ్లీ జరుగుతోంది. తెలంగాణలో ఏప్రిల్‌ నుంచే ‘సర్‌’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు, జనగణన తదితర కారణాలతో జాప్యం జరుగుతోంది.

రికార్డుల్లో 6.67లక్షల మంది ఓటర్లు

జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పరిధిలో 6.67లక్షల మంది ఓ టర్లున్నట్లు రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం ఓటరు మ్యా పింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు ఇంటింటికీ వెళ్లి మ్యా పింగ్‌ చేస్తున్నారు. అంటే.. గతంలో జరిగిన సవరణ ఆధారంగా ఉన్న జాబితా ప్రకారం ఒక్కో కుటుంబంలో ఇంటి పెద్ద తల్లి, తండ్రి, భర్త, కొడుకు, కూ తురు ఓటరును పోల్చుతూ ఒకేచోట మ్యాపింగ్‌ చే స్తున్నారు. అంటే, ఒక కుటుంబాన్ని ఒకేచోట చేర్చి మ్యాపింగ్‌ చేస్తుంటారు. ఒకవేళ ఓటరు జాబితాలో ఉన్న అడ్రస్‌ ప్రకారం వ్యక్తులు స్థానికంగా నివాసం లేకుంటే మ్యాపింగ్‌ చేయరు. దీంతో త్వరలో సమగ్రంగా చేపట్టే సర్వేలో ఇక్కడే ఓటు ఉండాలని భావి స్తే, ఈ ప్రాంతానికి చెందిన వారిమేనని దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన 12రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాలి. లేకుంటే ఆ ఓటరును జాబితా నుంచి తొలగిస్తారు.

జిల్లాలో మ్యాపింగ్‌ వివరాలు

అడ్డగోలుగా రెండేసి ఓట్లు

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపట్టే ముందు జరుగుతున్న ఈ మ్యాపింగ్‌లో డబుల్‌ ఓట్లు బయటపడుతున్నాయి. ఇప్పటికే రెండేసి ఓట్లు, వలస వెళ్లి మరోచోట ఉన్న ఓట్లు, మృతులు, ఇతర నియోజకవర్గాలకు అడ్రస్‌ మార్చుకున్న ఓటర్ల వివరాలు తెలిసిపోతున్నాయి. చాలాచోట్ల ఓట రు జాబితాలో ఉన్న ఓటర్లు స్థానిక పోలింగ్‌ కేంద్రాల పరిధిలో నివాసం లేరు. దీంతో వారందరి ఓట్లు మ్యాపింగ్‌కు దూరంగా ఉంటున్నాయి. బూత్‌ లెవెల్‌ అధికారులు వారి ఫోన్‌ నంబర్లు తెలుసుకుని ఆరా తీసి ఎక్కడ ఓటు ఉందో.. లేదో.. కనుక్కుని ఆ మేరకు వివరాలు నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఫోన్‌ నంబర్లు, వారంతా ఎక్కడ ఉంటున్నారో కూడా స్పష్టత లేకుండా ఉంది. జిల్లా కేంద్రంతోపాటు సింగరేణి కార్మికులు, పట్టణాల్లో ఉన్న వారంతా జిల్లాలో కొంతకాలం ఉండి ఆ తర్వాత శాశ్వతంగా వలస వెళ్లి పోయారు. దీంతో ఆ ఓట్లు తదుపరి జాబితాలో తొలగించే అవకాశముంది. ప్రత్యేక సమగ్ర సవరణలో మళ్లీ తమ పేర్లు స్థానికంగా ఉన్నట్లుగా నమోదు చేయాలంటే ఏదైన ధ్రువీకరణ పత్రం తప్పకుండా చూపించాల్సి ఉంది. అయితే, చాలామందికి రెండేసి ప్రాంతాల్లో ఓట్లున్నట్లు తెలుస్తోంది. రెండుచోట్ల ఓట్లున్నవి కూడా సర్వేతో బయటపడుతున్నాయి. మరోవైపు పట్టణా ల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలంటూ బూత్‌ స్థాయి అధికారులతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement