మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు 84.39శాతం జిల్లాకు చేరాయి. ఇంకా 15.61శాతం రావాల్సి ఉంది. పాత మంచిర్యాలలోని బుక్‌డిపోకు పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతున్నాయి. గతంలో ఆలస్యం కారణంగా విద్యార్థులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి బడులు తెరిచేనాటికే పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాకు అవసరమైన పుస్తకాలు
జిల్లాలో 480 ప్రాథమిక, 96 ప్రాథమికోన్నత, 108 ఉన్నత పాఠశాలలుండగా 38,298 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 కేజీబీవీల్లో 4,640 మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 3,073 మంది విద్యార్థులు న్నారు. జిల్లాకు 4,06,052 పాఠ్యపుస్తకాలు అవసరమున్నాయి. పార్ట్–1 పుస్తకాలు 3,05,620 అవస రం కాగా, ఇప్పటికే 2,57,910 జిల్లాకు చేరాయి. ఇంకా 47,710 పుస్తకాలు రావాల్సి ఉంది. పార్ట్–2 లో ఇంకా 90,290 పుస్తకాలు చేరాల్సి ఉంది. గ్రౌండ్ బ్యాలెన్స్‌లో 10,142 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మే చివరివరకు పుస్తక విక్రయ కేంద్రం నుంచి పాఠ్యపుస్తకాలను మండల పాయింట్లకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.
నేరుగా పాఠశాలలకే నోట్ పుస్తకాలు
హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకే నోట్ పుస్తకాలు సరఫరా కానున్నాయి. వీటిని సకాలంలో పంపిణీ చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కేజీబీవీల్లో విద్యార్థినులంతా పేదవారే కావడంతో ఉచితంగా పంపిణీ చేసే నోట్‌బుక్స్‌పైనే ఆధారపడుతుంటారు. నోట్‌పుస్తకాలు గతంలో సకాలంలో సరఫరా కాకపోవటంతో వారిపై ఆర్థికభారం పడింది. ఈ నేపథ్యంలోనే ఈసారి 1నుంచి 12వ వతరగతి విద్యార్థినులకు నోట్‌బుక్స్ సరఫరా, పంపిణీ షె డ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై మే 31నాటికి పూర్తి కావాలని ఆదేశాలు వచ్చాయి. మండల విద్యాశాఖ అధికారులు ప్రతిరోజూ సరఫరాను పర్యవేక్షిస్తూ.. పాఠశాల ల వారీగా నిల్వల వివరాలు డీఈవోలకు నివేదించా ల్సి ఉంటుంది. హెచ్‌ఎం లేదా ఒక ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, వర్క్‌పుస్తకాల స్వీకరణ, పంపిణీకి సంబంధించిన వివరాలను ఐఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అధి కారులు సూచించారు. జీరో ఎన్‌రోల్‌మెంట్ (విద్యార్థులు లేని) పాఠశాలలకు నోట్ బుక్స్ వెళ్తే వాటిని వెంటనే గుర్తించి జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్, డీఈ వో కార్యాలయానికి అప్పగించాలని ఆదేశించారు.


