రవాణా వ్యవస్థ మెరుగుపరుస్తాం | - | Sakshi
Sakshi News home page

రవాణా వ్యవస్థ మెరుగుపరుస్తాం

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

● రాష్ట కార్మికశాఖ మంత్రి వివేక్‌ ● రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

భీమారం: అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మించి రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మండలంలోని గెర్రిగూడెం నుంచి నర్సింగాపూర్‌ మీదుగా కాజిపల్లి వరకు రూ.4.40 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. బూర్గుపల్లి నుంచి కాజిపల్లి, ధాంపూర్‌ మధ్య రింగ్‌ రోడ్డు ని ర్మించనున్నట్లు పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు నీ టి సమస్య రాకుండా అనేక చర్యలు చేపట్టినట్లు తెలి పారు. అదనంగా బోరువెల్స్‌ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపా రు. దాంపూర్‌లో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని విజయవంతం చేసినందు కు అధికారులను అభినందించారు. వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, నాయకులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement