‘నీట్‌’ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ పకడ్బందీగా నిర్వహించాలి

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

మంచిర్యాలఅగ్రిల్చర్‌: నీట్‌ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా విద్యాధికారి యాదయ్యతో కలిసి నీట్‌ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. నీట్‌ పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన ఏ ర్పాట్లు చేయాలని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌, పరీ క్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షాకేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పాలనా విభాగం నుంచి ఒక నోడల్‌ అధికారి, పోలీస్‌శాఖ నుంచి నోడల్‌ అధి కారిని నియమించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష స మయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యు త్‌ సరఫరా చేయాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి, ఓఆర్‌ఎస్‌తోపాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్ర కారం జిల్లాలో అవసరమైన పరీక్షాకేంద్రాలు ఏర్పా టు చేయాలని, దివ్యాంగ అభ్యర్థుల కోసం సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో నీట్‌ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement