నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

రెబ్బెన: నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు సీఐ సంజయ్‌ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొమురవెళ్లికి చెందిన గజ్జల సూర్యకాంత్‌, అతని స్నేహితులైన జక్కులపెల్లికి చెందిన ధోని రాజేశ్‌, కొమురవెళ్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్‌లు ఏపీలోని శ్రీనివాస్‌ అనే వ్యక్తి వద్ద నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అంటకట్టే ప్రయత్నం చేశారన్నారు. తమకు అందించిన పక్కా సమాచారం మేరకు సూర్యకాంత్‌ వద్ద నుండి 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4,37,500 ఉంటుందన్నారు. మండల వ్యవసాయాధికారి దిలీప్‌ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement