బ్యాటరీల చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాటరీల చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

మందమర్రిరూరల్‌: సింగరేణి బ్యాటరీల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్‌ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మందమర్రి ఏరియాలోని స్టోర్స్‌లో ఈ నెల 20న విలువైన బ్యాటరీలో చోరీకి గురయ్యాయి. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు 25న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని నార్లాపూర్‌ సమీపంలో నేషనల్‌ హైవేపై ఎస్సై నరేష్‌, సిబ్బందితో కలిసి ఆటోను తనిఖీ చేయగా 25 బ్యాటరీలు లభించాయి. ఆటోలో ఉన్న వారిని ప్రశ్నించగా స్టోర్స్‌లో దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. బ్యాటరీలను స్వాధీనం చేసుకుని నిందితులు మునియప్ప, నరేంద్ర, శివప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement