బాసర: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భౌతికశాస్త్ర ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్ ‘ఫిజిక్స్ హబ్’ను మంగళవారం విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఏ.గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి.దేవరాజు ఈ ఇంటరాక్టివ్ పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపారు. కఠినమైన భౌతికశాస్త్ర భావనలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో విజువల్ సిమ్యులేషన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాంపస్‌లోని సుమారు 1,500 మంది పీయూసీ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్‌లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


