పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన టి.పాల్ (45) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు అతని నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మధుసూదన్‌రెడ్డి నేత్ర దానానికి ముందుకు వచ్చిన మృతుని కుమారుడు మనో జ్, కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, సభ్యులు డా.సుగుణాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.


