రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎనిమిది జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పోటీలు ముగియగా రంగారెడ్డి, కరీంనగర్ జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ కరీంనగర్–ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగగా 3–1 గోల్స్‌తో కరీంనగర్ గెలుపొంది ఫైనల్‌కు చేరింది. మరో సెమీఫైనల్ మ్యాచ్ స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి, నిజామాబాద్‌ల మధ్య జరుగగా 1–1 గోల్స్‌తో ఇరు జట్ల మ్యాచ్ టై కావడంతో పెనాల్టీ షూట్‌అవుట్ నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా సాగిన షూట్‌అవుట్‌లో 5–4 గోల్స్‌తో స్పోర్ట్స్ స్కూల్ రంగారెడ్డి జట్టు గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం కరీంనగర్, రంగారెడ్డి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారీ, బెల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు.


