పెంబి: మండల కేంద్రం శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్ కుమార్, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కా లి బూడిదయ్యింది. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్‌ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్‌ఐ శ్రావణ్ రెడ్డి, ఏ ఈవో నాగమణి, జీపీవో భాస్కర్ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు.
మాలేగాంలో...
కుభీర్: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు.


