‘గులాబీ’ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

‘గులాబీ’ జోష్‌

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

క్యాడర్‌లో నూతనోత్సాహం నింపిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నస్పూర్‌లో కార్యకర్తలతో సమావేశం క్యాతనపల్లి విలేకరులతో చిట్‌చాట్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు ‘మున్సిపల్‌’ విజేతలకు అభినందన

నస్పూర్‌/రామకృష్ణాపూర్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాకరామారావు జిల్లా పర్యటన ఆ పార్టీ క్యాడర్‌లో జోష్‌ నింపింది. నస్పూర్‌లో ని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరై కాంగ్రెస్‌ పా లనపై ఘాటైన విమర్శలు చేశారు. పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, మారుపేర్ల సమ స్య, మెడికల్‌ బోర్డు నిర్వహణ కోసం తాము ఆందోళనలు నిర్వహిస్తామని, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేటీఆర్‌ ప్రసంగిస్తుండగా పలువురు నిరుద్యోగులు సేవ్‌ సింగరేణి.. మెడికల్‌ బోర్డు నిర్వహించాలి.. మారు పేర్ల సమస్య పరిష్కరించాలి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. కత్తి మరొకరికిచ్చి యుద్ధం తమను చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని సూచించారు. సింగరేణిలో సమస్యల పరిష్కారానికి టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి

నస్పూర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సా ధ్యమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి మూసిపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలపై లేదని ఆరోపించారు. బీ ఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందిన క్యాతనపల్లి కౌన్సిలర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చివరివరకు పోరాడి చై ర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులు దక్కించుకో వడం అభినందనీయమని కొనియాడారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మా ట్లాడుతూ.. గోదావరినదిపై తలపెట్టిన మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మాణాన్ని మంచిర్యాల ఎమ్మె ల్యే స్వార్థంతో రద్దు చేయించారని ఆరోపించారు.

క్యాతనపల్లిలో పర్యటన

ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కేటీఆర్‌ పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆయన రాకతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. క్యాతనపల్లి పర్యటనలో భాగంగా కేటీఆర్‌ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహ వేడుకలకు హాజ రై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ నివాసానికి వచ్చిన కేటీఆర్‌ సీపీఐ ముఖ్య నాయకులతో ప్ర త్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో క్యాతనపల్లి పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో మిత్రపక్షమైన సీపీఐ, బీఆర్‌ఎస్‌ నాయకులను వె న్నుతట్టాలని ఆయన రావటంపై కార్యకర్తల్లో హ ర్షం వ్యక్తమవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ధైర్యంగా నిలబడి మున్సిపాలిటీని దక్కించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కులు, వారసత్వ ఉద్యోగాల కోసం సంయుక్తంగా పోరాటం చేస్తే బాగుంటుందని సీపీఐ నేతలకు సూచించినట్లు సమాచారం.

‘బల్దియా’ విజేతలకు సన్మానం

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలు పొందిన క్యాతనపల్లి, ఆసిఫాబాద్‌ మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌లను కేటీఆర్‌ శాలువాలతో సన్మానించి అభినందించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్‌, మంచిర్యాల, సిర్పూర్‌, రామగుండం మాజీ ఎ మ్మెల్యేలు దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కో రుకంటి చందర్‌, రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు మిర్యాల రాజిరెడ్డి, కేతిరె డ్డి సురేందర్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, నాయకులు అక్కూరి సుబ్బ య్య, వంగ తిరుపతి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement