రాష్ట్రస్థాయి పోటీల్లో 12 పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో 12 పతకాలు

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

ఆదిలాబాద్‌: హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆదిలాబాద్‌ జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. అండర్‌–20, సీనియర్‌ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో మహిళల హామర్‌ త్రోలో డి.అరుణ స్వర్ణం, డిస్కస్‌ త్రోలో కాంస్యం, అండర్‌–20 రేస్‌ వాక్‌లో అట్టం జస్వంత్‌ బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. ట్రిపుల్‌ జంప్‌లో సీహెచ్‌ వసంత రజతం, షాట్‌పుట్‌లో కాంస్య, హామర్‌త్రోలో రాథోడ్‌ వంశీ, సాక్షి రజతం, రాధా రాణి కాంస్య సాధించారు. అండర్‌–20 బాలుర విభాగంలో శివ సాయి షాట్‌పుట్‌లో రజతం, హామర్‌ త్రోలో కాంస్య, రేస్‌ వాక్‌లో ఎం.అన్వేష్‌ రజతం, గంగోత్రి కాంస్య పతకం సాధించి జిల్లా ప్రతిభను చాటారు. సదరు క్రీడాకారులు, కోచ్‌ రాకేష్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.రాజేశ్‌ను అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్‌, పెటా అధ్యక్షుడు పార్థసారథి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement