బెల్లంపల్లి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బెల్లంపల్లిలోని గురుకుల విద్యాలయాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు 61 మందికిగానూ వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గానూ గాందర్ల అక్షయ్ 467, బోర్కూటీ కౌశిక్ 466, పెరుగువార్ సృజన్ 465 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 73 మందికిగానూ 72 మందితో 98.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గానూ కొదురుపాక మన్వీత్ 987, మైలారపు విశ్వతేజ 984, దౌనే ఆదర్శ్ 983, బైపీసీ విభాగంలో ఇప్ప శ్రీరామ్ 980, పృథ్వీరాజ్‌నాయక్ 977, దుర్గం శివరాం 976 మార్కులు సాధించారు. సదరు విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్, అధ్యాపకులు అభినందించారు.


