పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

● డీజీపీ శివధర్‌రెడ్డి ● పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభం

భీమిని: ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి కన్నెపల్లి మండలంలో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందించే దిశగా ప్రతీ పోలీస్‌ అధికారి, సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారని చెప్పారు. సాంకేతికతను వినియోగిస్తూ కేసుల విచారణను వేగవంతం చేయడమే కాకుండా ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ అంబర్‌కిషోర్‌ ఝా, డీసీపీ భాస్కర్‌, ఏసీ పీ కిరణ్‌కుమార్‌, సీఐ దేవయ్య, ఎస్సై భాస్కర్‌రా వు, కన్నెపల్లి, గొల్లగట్టు సర్పంచులు గడ్డల జయలక్ష్మి, నెండుగూరి వెంకన్న, పోలీస్‌ సిబ్బంది, నాయకులు నర్సింగరావు, హరీశ్‌గౌడ్‌ తదితరులున్నారు.

క్రికెట్‌ పోటీల విజేతలకు బహుమతులు

తాండూర్‌: బోయపల్లిలో నిర్వహించిన మాసాడి రామయ్య స్మారక క్రికెట్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి డీజీపీ శివధర్‌రెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గ డ్డం వినోద్‌ హాజరయ్యారు. విజేతగా నిలిచిన అచ్చలాపూర్‌, రన్నరప్‌గా నిలిచిన బోయపల్లి జట్లకు నగ దు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. గెలిచిన జట్లే కాకుండా ఓడిన జట్లూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతి, స్థానిక సర్పంచులు శంకరమ్మ, ముదాం సునీత, సార్ల తిరుపతి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement