ఈసారి కాస్త మెరుగు | - | Sakshi
Sakshi News home page

ఈసారి కాస్త మెరుగు

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

● ‘ఇంటర్‌’ ఫలితాల్లో బాలికలదే పైచేయి ● గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం ● ద్వితీయ సంవత్సరంలో 19వ స్థానం ● ప్రథమ సంవత్సరంలో 21వ స్థానం

బాలికలదే హవా..

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీ య సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు గతేడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్‌ బోర్డు ఆదివారం ఫలితాలు విడుదల చేయగా రాష్ట్రస్థాయిలో జిల్లాకు ఫస్టియర్‌లో 21వ, సెకండియర్‌లో 19వ స్థానం లభించింది. గతేడాది ఫస్టియర్‌లో 26వ స్థానంలో (54.48శాతం) నిలవగా, ఈసారి 60.31శాతం ఉత్తీర్ణతతో 21వ స్థానం, సెకండియర్‌లో (67.85శాతం) 21వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 71.63 శాతం సాధించి 19వ స్థానంలో నిలిచింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 5,372 మందికి గాను 3,240 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,741 మందికి గాను 3,396 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

సౌకర్యాలు మెరుగుపడినా..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించినా, రోజువారీగా స్టడీ అవర్‌, రెండు పూటలా స్పెషల్‌క్లాస్‌లు నిర్వహించినా, వెనుకబడిన వి ద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపినా ఆశించిన ఫలితాలు రాలే దు. జిల్లాలో 10 ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలల్లో ఫస్టియర్‌ ఫలితాలు చూస్తే కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధించలేక వె నుకబడిపోయాయి. సెకండియర్‌లో 55.80శాతంతో మెరుగైన ఫలితాలు సాధించాయి. జిల్లాలోని కొన్ని కళాశాలలు కనీసం 12శాతం ఉత్తీర్ణత సాధించలేకపోయాయి.

ప్రథమ సంవత్సరం ఫలితాలు ఇలా..

జిల్లాలో మొదటి సంవత్సరంలో జనరల్‌ విద్యార్థులు 43.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. లక్సెట్టిపేట కళాశాలలో అత్యధికంగా 80.45శాతం ఉత్తీర్ణత సాధించి ముందువరుసలో నిలిచారు. జన్నారం కళాశాల 13.39శాతం ఉత్తీర్ణతతో చివర వరుసలో నిలిచింది. లక్సెటిపేటలో 266 మందికి గాను 214 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తర్వాత స్థానంలో దండేపల్లిలో 93 మందికిగాను 52 మంది, బెల్లంపల్లి (బాలికలు) కళాశాలలో 172కు 95, బెల్లంపల్లిలో 199కి 95, కాసిపేటలో 101కి 42, జైపూర్‌లో 78కి 12, మందమర్రిలో 76కు 15, జన్నారంలో 112కు 15, చెన్నూర్‌లో 117కు 30, మంచిర్యాల కళాశాలలో 148 మందికి గాను 25మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ద్వితీయ సంవత్సరంలో..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివే ద్వితీయ సంవత్సరం (జనరల్‌ విద్యార్థులు) 1,043 మందికి గాను 582 (55.80శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బెల్లంపల్లి (బాలికలు) కళాశాల విద్యార్థులు 89.66శాతం ఉత్తీర్ణతతో సత్తా చాట గా, జన్నారం కళాశాల అత్యంత వె నుకబడి 11.11శాతంతో సరిపెట్టుకో వాల్సి వచ్చింది. బెల్లంపల్లి బాలికల కళాశాలలో 145 మంది విద్యార్థుల కు గాను 130 మంది ఉత్తీర్ణత సా ధించిన బాలికలు హవా కొనసాగించారు. తర్వాత స్థానంలో బె ల్లంపలి కళాశాలకు చెందిన 163 మందికిగాను 124 మంది, లక్సెటిపేటలో 103కు 77, చెన్నూర్‌లో 94కు 62, కాసిపేటలో 44కు 20, దండేపల్లిలో 83కు 52, జైపూర్‌లో 71కి 18, మంచిర్యాలలో 188కి 67, మందమర్రిలో 44కు 20, జన్నారం కళాశాలలో 83 మందికి గాను 52 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌ కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు 655 మందికి గాను 359 (54.8శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 552 మంది పరీక్ష రాయగా 399 (72.20శాతం) మంది పాసయ్యారు. ఇంటర్‌లో లోపాలు సవరించుకుంటూ భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధించాలంటే ఇప్పటినుంచే అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది.

కాసిపేట ‘మోడల్‌’

విద్యార్థినికి ఐదో ర్యాంక్‌

కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న దేవాపూర్‌కు చెందిన విద్యార్థిని కొ మ్మల స్వతంత్ర 992 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంక్‌ సాధించి ఆదర్శంగా నిలి చినట్లు ప్రిన్సిపల్‌ ఖలీల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు స్వతంత్రను అభినందించారు. ఇంటర్‌ సెకండియర్‌లో 96మంది పరీక్ష రాయగా 91మంది ఉత్తీర్ణ త సాధించి 94.8శాతం ఫలితాలు నమోదు చేసినట్లు ప్రిన్సిపల్‌ తెలిపారు. మరో ము గ్గురు 900కుపైగా మార్కులు సాధించి ప్రతి భ కనబరిచినట్లు పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లాలో బాలికలదే హవా సాగింది. ఫస్టియర్‌లో (జనరల్‌) బాలురు 48.72 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలికలు 69.84శాతం ఉత్తీర్ణతతో ముందువరుసలో నిలిచారు. సెకండియర్‌లో బాలురు 62.75 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 78.92శాతంతో సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం వొకేషనల్‌లో బాలురు 47.64 శాతం సాధించగా, బాలికలు 68.48శాతం ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 65 శాతం సాధించగా, బాలికలు 86.56 శాతంతో సత్తా చాటారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థుల ఫలితాల కంటే రాష్ట్రస్థాయిలో వొకేషనల్‌లో మొదటి సంవత్సరంలో 23వ స్థానం వెనుకబడగా, ద్వితీయ సంవత్సరంలో 10వ స్థానంలో నిలవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement