జన్నారం: గడువు దాటినా ప్రభుత్వం కావాల నే పీఆర్సీ నివేదికల తయారీలో జాప్యం చేస్తోందని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌నాయక్ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల్లోనూ ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. డీఏలు, సమగ్ర కుటుంబ సర్వే పారితోషికం వెంటనే చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని, రిటైర్డ్ ఉపాధ్యాయులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలని, ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని అధికారికంగా మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.


