లక్సెట్టిపేట కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చే యాలని గతంలో క మిటీ వేశారు. నియోజకవర్గం కోసం అందరూ కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న నియోజకవర్గాన్ని మంచిర్యాలగా మార్చడంతో లక్సెట్టిపేట చాలా వెనుకబడిపోయింది. – చుంచు రాజ్‌కిరణ్, వైద్యులు, గ్రామం: కన్నెపల్లి, మం: దండేపల్లి
పూర్య వైభవం వస్తుంది..
మూడు మండలాలు కలుపుతూ లక్సెట్టిపేటను నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే పట్టణానికి పూర్వ వైభవం వస్తుంది. జనాభా పెరుగుదలతోపాటు నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రజలు నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నూతన నియోజకవర్గాల ఏర్పాటులో పట్టణాన్ని ప్రకటించాలి.
– కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్, లక్సెట్టిపేట


