మంచిర్యాలక్రైం: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. స్థానిక జ్యోతినగర్ కాలనీకి చెందిన ఇందారపు రాజయ్య ఇంట్లో గత నెల 13న చోరీ జరగడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ నెల1న రాత్రి స్థానిక ఏసీసీ సాయిరాం నగర్‌కు చెందిన కలవేన వసంత్ దొంగిలించిన సొమ్ము విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్దనుంచి 19.37 గ్రాముల బంగారం, యమహా బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా అక్షయ్, అభి, మరొకరితో కలిసి 8 తులాల బంగారం, 29 తులాల వెండి, రూ.18 వేల నగదు చోరీ చేసి పంచుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై శ్రవణ్‌కుమార్, సీసీఎస్ పోలీసులు, భరత్, మహేష్, తిరుపతిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


