మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాత మంచిర్యాల ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికులు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా, ఆర్టిజన్స్ అనే దినసరి కూలీలుగా మిగిలిపోయామని వాపోయారు. విద్యార్హతలు, సీనియారిటీ ఉండి కూడా కనీస సర్వీస్ రూల్స్ లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్నామని తెలిపారు. వెంటనే కన్వర్షన్ అనే డిమాండ్‌ను పరిశీలించి ఆర్టిజన్స్‌కు న్యాయం చేయాలని, వివిధ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ, పవన్, 541 జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శివ, చుంచు రమేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.


