రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఈ నెల 4న చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలు పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ రమేష్, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్‌తో మాట్లాడి సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లకు సమయానికి నోటీసులు అందించాలని తెలిపారు.


