శ్రీరాంపూర్: కార్మికులకు గుదిబండగా మారిన నూతన లేబర్ కోడ్‌లను కేంద్రం ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఆర్కే 7 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామంటున్న లేబర్ కోడ్‌లను కార్మిక వర్గం తిప్పి కొట్టాలన్నారు. లేబర్ కోడ్‌లు అమలైతే కార్మికులు కట్టు బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ శ్రీనివాస్, శ్రీధర్ సమ్మయ్య, గడ్డం శంకర్, అభిలాష్ సదానందం పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన..
లేబర్ కోడ్‌లకు నిరసనగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శ్రీరాంపూర్‌లోని పలు డిపార్టుమెంట్ల వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర నాయకుడు దేవయ్య, నాయకులు డీ.బ్రహ్మానందం, శంకరి, సత్యం, అప్పారావు, తిరుపతిరెడ్డి, కనకయ్య పాల్గొన్నారు.


