విద్యుదాఘాతంతో ఆవు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఆవు మృతి

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని చాందా (టి) గ్రామానికి చెందిన చిందం చిన్న దేవన్నకు చెందిన ఆవు సోమవారం రాత్రి విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు తెగి ఆవుపై పడ్డాయి. దీంతో షాక్‌ తగిలి ఆవు మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని రైతు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నాడు.

మెరుగైన విద్యనందించాలి

ఆదిలాబాద్‌రూరల్‌: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని చించుఘాట్‌, వాన్‌వాట్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జిల్లా కేంద్రంలోని స్టార్‌ 50 కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పాఠాలు బోధించారు. ఐటీడీఏ పల్స్‌ యాప్‌ పనితరుపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, పల్స్‌ యాప్‌పై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులున్నారు.

కౌటాలలో

తేనెటీగల దాడి

కౌటాల: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్న పలువురిపై మంగళవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేశాయి. సమీప చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. కార్యాలయం తలుపులు మూసుకుని అందులోనే ఉన్నారు. రామగిరి విజయ్‌, దివాకర్‌, తిరుమలేశ్‌, హన్మంతు తేనెటీగల దాడిలో గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి చిక్సిత అందించారు. అధికారులు స్పందించి తేనెటీగల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

డీఅడిక్షన్‌ సెంటర్‌కు

బాలుడి తరలింపు

చెన్నూర్‌: చెన్నూర్‌ పట్టణానికి చెందిన బాలు డు (17) గంజాయికి అలవాటు పడగా పోలీ సులు డీఅడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ బన్సీలాల్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్ర కారం.. బాధిత బాలుడు స్నేహితులతో కలిసి గంజాయికి బానిసయ్యాడు. మహారాష్ట్రకు వె ళ్లి గంజాయి కొనుగోలు చేసి తాగుతున్నాడు. గతంలో పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినా అతడిలో మార్పు రాలేదు. గంజాయి తరచూ సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో అతడిని పట్టుకుని వైద్యాధికారి సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్టు రావడంతో కేసు నమో దు చేసి మెజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు బాలుడిలో మా ర్పు రావడానికి వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాలలోని డీ అడిక్షన్‌ సెంటర్‌లో అడ్మిట్‌ చే శారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడిడి తే వెంటనే ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేసి డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలిస్తామని సీఐ హెచ్చరించారు. సమాశంలో ఎస్సైలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement