‘హిందు ధర్మ పరిరక్షణకు కృషిచేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘హిందు ధర్మ పరిరక్షణకు కృషిచేయాలి’

Mar 25 2026 6:57 AM | Updated on Mar 25 2026 6:57 AM

దండేపల్లి: హిందు ధర్మ పరిరక్షణకు హిందువులంతా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని మేదరిపేట నుంచి ముత్యంపేట వరకు బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్‌ దీక్షా స్వాములు మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తించారు. అనంతరం స్వాములందరికీ ముత్యంపేటలో భిక్ష ఏర్పాటు చేశారు. బీజేపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బందెల రవిగౌడ్‌, పత్తిపాక సంతోష్‌, గోపతి రాజయ్య, నలిమెల మహేష్‌, సురేందర్‌, అశోక్‌, శ్రీనివాస్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement