పాతమంచిర్యాల: ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, విద్యుత్ బస్సుల ను ఆర్టీసీకే ఇవ్వాలని, ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చిందని, పెరిగిన అవసరాల మేరకు బస్సులు, కార్మికుల సంఖ్య పెరగలేదని తెలిపారు. విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు, కార్మి కుల సంఖ్య పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాసు, గోమాస ప్రకాష్, రబీయా, కుమరస్వామి, సంతోష్, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.


