నెన్నెల: జంక్‌ఫుడ్ జోలికి వెళ్లమంటూ మండలంలోని గంగారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రమాణం చేశారు. ఉపాధ్యాయుల ప్రేరణతో గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడళ్ల వద్ద ‘ఇంటి వంటలు ఒంటికి మేలు, ఈట్ వెల్ న్యూ హెల్దీ, జంక్ ఫుడ్ కీల్స్ చూజ్ లైఫ్’ అంటూ నినాదాలు చేశారు. చిప్స్‌ప్యాకెట్లు, బింగోలాంటి తినుబండారాల ప్యాకెట్లను కాల్చివేసి వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వీటితో పాటు పలు రకాల కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంత హానికరమో వివరించారు. చిన్నారుల్లో వెల్లివిరిసిన ఆరోగ్య చైతన్యాన్ని చూసి గ్రామస్తులు మెచ్చుకున్నారు.


