లోకేశ్వరం: మండలంలోని హథ్గాం గ్రామ పంచాయతీ పరిధి పోట్‌పల్లి(ఎం) గ్రా మానికి చెందిన లిఖిత(33) అనే యువతి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోట్‌పల్లి (ఎం) గ్రామానికి చెందిన కల్యాబాయి –వినాయక్‌రావుల కూతరు లిఖిత కొంత కాలంగా అనారోగ్యంతో పెళ్లి చేసుకోకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి నయం కాలేదు. ఈక్రమంలో ఆదివారం రాత్రి అన్నం తినకుండానే పడుకుంది. సోమవారం ఉదయం చూసే సరికి లిఖిత మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలు సోదరి అర్చన అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


