ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

Mar 24 2026 7:09 AM | Updated on Mar 24 2026 7:09 AM

● ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌

ఉట్నూర్‌రూరల్‌: ప్రతీ సోమవారం ప్రజావాణి కా ర్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూ ర్‌ ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలని, మహిళ సంఘ భవనం నిర్మించాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా నియమించాలని, పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా అందించాలని కోరారు. స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.

డిజిటలైజ్‌ పద్ధతిలో ఫిర్యాదుల స్వీకరణ..

ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను డిజిటలైజ్‌ చేసినట్లు పీవో అన్నారు. సోమవారం ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్‌ చేశారు. ప్రతీ ఫిర్యాదుదారునికి ఒక ’ఎలక్ట్రానిక్‌ ఫిర్యాదు కార్డు’ జారీ చేస్తామన్నారు. ఈ కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి తన ఫిర్యాదు ప్రస్తుత స్థితిని నేరుగా తెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement