క్రీడల్లో మాస్టారు అదరహో! | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో మాస్టారు అదరహో!

Mar 24 2026 7:09 AM | Updated on Mar 24 2026 7:09 AM

దండేపల్లి: అతను విద్యార్థులకు ఆటలు నేర్పించే మాస్టారు. ఆటలు నేర్పించడంతో పాటు ఆటల్లోనూ అదరగొడుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో దూసుకెళ్తున్న దండేపల్లి మండలం రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్‌ తన ఆటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాడు. ఏటా ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నాడు. మూడేళ్లుగా సివిల్‌ సర్వీసెస్‌ రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. 2018లో చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లో నిర్వహించిన ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ అథ్లెటిక్‌ పోటీల్లో ఐదోస్థానంలో నిలిచాడు. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్ది వారిని సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement