మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన శ్రీహర్షవర్ధ్దన్ తన తండ్రి కృష్ణ స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌పై చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకుని, శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. అండర్ 15, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో జిల్లాస్థాయిలో ప్రాతినిధ్యం వహించి, పురుషుల విభాగంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించేందుకు మూడుసార్లు ఎంపికయ్యాడు. ప్రస్తుతం మాస్టర్స్ 35 ప్లస్ విభాగంలో పోటీ పడుతూ గత రెండేళ్లుగా వరుసగా మిక్స్‌డ్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలుస్తున్నాడు. స్పోర్ట్స్ కోటాలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. హైదరాబాద్‌లో విధులను నిర్వహిస్తూనే ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే అఖిల భారత రక్షణ ఖాతాల విభాగం బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లలో పాల్గొని తన సత్తా చాటుతున్నాడు.


