నాసిరకం భోజనం పెడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాసిరకం భోజనం పెడితే చర్యలు

Mar 24 2026 7:08 AM | Updated on Mar 24 2026 7:08 AM

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నెన్నెల: ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌ అన్నారు. ‘నాసిరకం భో జనం మాకొద్దు’ అంటూ ఆదివారం విద్యార్థులు ధర్నా చేసిన విషయం తెలుసుకుని సోమవారం కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠి న చర్యలు తప్పవని హాస్టల్‌ వార్డెన్‌ను హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ అబ్దుల్‌హై ఉన్నారు.

రైతుల ఖాతాల్లోకి భరోసా నగదు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రైతులకు యాసంగి పెట్టుబడి సాయం మొదటి విడత రైతు భరోసా నగదు ప్రభుత్వం సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎన్ని ఎకరాలతో సంబంధం లేకుండా ఎకరం భూమి ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున 1,52,002 మంది రైతులకు రూ.76,91,79,355 నగదు విడుదల చేసింది. 20 రోజుల తర్వాత రెండోవిడత ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు, మూడో విడత ఏప్రిల్‌ నెలాఖరులో అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

స్పర్శలేని మచ్చలు

ఉంటే తెలపాలి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ఎలాంటి స్పర్శలేని మచ్చలుంటే వెంటనే సమీప వైద్య సిబ్బందికి తెలియజేయాలని కుష్టు నివారణ కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌ అన్నారు. సోమవారం ముల్కల్ల డివిజన్‌ కార్యాలయం వద్ద కుష్టు నివారణ కార్యక్రమ నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే తెలియజేస్తే తగిన చికిత్స అందించి పూర్తిగా నియంత్రించవచ్చన్నారు. కుష్టు వ్యాధిపై అపోహలు, భయాలు వీడాలన్నారు. డివిజన్‌ కార్పొరేటర్‌ బియ్యాల త్రివేణి, డెమో వెంకటేశ్వర్లు, డీపీఎం రాఘవయ్య, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, హెచ్‌ఈవో రఘుపతి, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్‌ సాయిప్రసన్న, ఏఎన్‌ఎంలు పద్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సో మవారం జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

పశువులకు టీకాలు వేయించాలి

పాడిరైతులు పశువులకు తప్పనిసరిగా గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ అవరణలో జిల్లా పశుసంవర్థక, పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల సంచార వాహనాన్ని జిల్లా పశువైద్యాధికారి యాకుబ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 9 వరకు ఎనిమిదో విడత టీకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పాడి రైతులు తమ పశువులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలన్నారు.

విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాలఅర్బన్‌: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ అన్నారు. సోమవారం శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement