‘ఇంటింటికీ సీపీఐ’ని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘ఇంటింటికీ సీపీఐ’ని విజయవంతం చేయాలి

Mar 23 2026 8:55 AM | Updated on Mar 23 2026 8:55 AM

పాతమంచిర్యాల: ఏప్రిల్‌ 1నుంచి 10వరకు జిల్లాలో చేపట్టను న్న ‘ఇంటింటికీ సీీపీఐ’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ.. నిధి సేకరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ పిలుపునిచ్చారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో సీపీఐ జిల్లా సమితి సమావేశం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సింగరేణి పరిరక్షణకు ‘సేవ్‌ సింగరేణి’ (జాత) ఈ నెల 18న శ్రీ రాంపూర్‌లో ప్రారంభం కాగా, 30న కొత్తగూడెం హెడ్‌ ఆఫీస్‌ ముట్టడితో ము గుస్తుందని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, రాష్ట్ర సమి తి సభ్యులు వెంకటస్వామి, దాసు, చంద్రశేఖర్‌, మల్లేశ్‌, లింగయ్య, సమ్మయ్య, నర్సయ్య, రాజమౌళి, దుర్గారాజ్‌, లక్ష్మీనారాయణ, బానేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement