లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ఎస్సార్ ఫంక్షన్ హాల్‌లో బీట్‌సెల్ సాఫ్ట్ సొల్యూషన్ ఆ ధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాకు స్పందన లభించింది. 1,264 మంది వి ద్యార్థులు, నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకో గా, 776 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా బీట్‌సెల్ సీఈవో సన్ని మాట్లాడు తూ.. పదోతరగతి నుంచి బీటెక్ వరకు చదువుకున్నవారికి ఉద్యోగాలు కల్పించాలనే ల క్ష్యంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. 40 కంపెనీల ప్రతినిధులు మేళాకు హాజ రై ఇంటర్వ్యూలు నిర్వహించగా 268మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మిగతావారు రెండో రౌండ్‌లో పాల్గొంటారు. జీవీకే బ్రదర్స్ సీఈవో గుండాల విజయ్‌కుమార్, కంపెనీ ని ర్వాహకులు అరవింద్, ప్రవీణ్‌సిద్దు, ప్రభాకర్ చౌటి, వశిష్ట, రాహుల్, మధుకర్, చందర్, మ ధుకర్, సుమన్, సూర్యప్రసన్న పాల్గొన్నారు.


