కొండగట్టుకు మేయర్‌ మహాపాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

కొండగట్టుకు మేయర్‌ మహాపాదయాత్ర

Mar 23 2026 8:55 AM | Updated on Mar 23 2026 8:55 AM

నస్పూర్‌: గతంలో అనారోగ్యానికి గురైన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావడంతో తన మొక్కు తీర్చుకునేందుకు నగర మేయర్‌ ధర్ని మధుకర్‌ ఆదివారం కొండగట్టుకు మ హాపాదయాత్ర ప్రారంభించారు. ముందుగా సీతారాంపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. తన కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకునేందుకు దీక్షాపరులతో కలిసి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిమానంతో 2029లోనూ ప్రేంసాగర్‌రావు ఎ మ్మెల్యేగా గెలవాలని ఆంజనేయస్వామిని వే డుకోనున్నట్లు పేర్కొన్నారు. నస్పూర్‌ ఇన్‌చా ర్జి నూకల రమేశ్‌, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎంబడి కుమారస్వామి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement