రామకృష్ణాపూర్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్ల కో సమే శిలాఫలకాలు వేసిందని, తాము శిలాఫలకం వేసిన ప్రతీ పనిని పూర్తి చేసి చూపిస్తామని రాష్ట్ర కా ర్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. క్యాతనపల్లిలోని పలు వా ర్డుల్లో ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అ భివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోయారని ఆ రోపించారు. చెన్నూర్, క్యాతనపల్లి, మందమర్రి ప ట్టణాల్లో ఎక్కడా సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవని తెలి పారు. డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నా రు. అమృత్ స్కీం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.40 కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ.. రూ.30 కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో క్యాతనపల్లిలో చేపట్టిన పనుల్లో 20శాతం పూర్తయినట్లు తె లిపారు. పట్టణంలో హైమాస్ట్ సోలార్ లైట్లు ఏర్పా టు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీనివాసగార్డెన్స్ నుంచి ఎంఎన్‌ఆర్ గార్డెన్స్ వరకు రూ.కోటి 80 లక్షలతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, 8, 9 వార్డుల్లో రూ.13లక్షలతో, ఐదోవార్డులో రూ.27 లక్షలతో చే పట్టిన సీసీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. 14వ వార్డులో రూ.24 లక్షలతో, 15వ వార్డులో రూ.31 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. 10వ వార్డులో రూ.2.09 కోట్లతో చేపట్టిన కుర్మపల్లి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, నాయకులు రాజు, శ్రీనివాస్, సమ్మయ్య ఉన్నారు.
చెరువు సుందరీకరణ పనులు ప్రారంభం
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరి ఽధి పాత బస్టాండ్ సమీపంలోగల ఊరు మందమర్రికి వెళ్లే మార్గంలోని ఊరచెరువు మినీ ట్యాంక్‌బాండ్ సుందరీకరణ పనులకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రూ.2.31కోట్లతో చెరువును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజలింగు, అధికారులు, కాంగ్రెస్ నాయకులున్నారు.


