జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వస తి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించా లని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. మండల కేంద్రంలోని ఆశ్రమోన్నత పాఠశాల, కేజీబీవీని ఆయన ఆదివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, నిత్యావసరాల నిల్వలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాజరు రిజిష్టర్లు, వసతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శివరాజం, కేజీబీవీ ఎస్వో శ్రావణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


