‘కేంద్రీయ’ ప్రవేశాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

‘కేంద్రీయ’ ప్రవేశాలకు వేళాయె

Mar 20 2026 8:23 AM | Updated on Mar 20 2026 8:23 AM

● నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ● ఆదిలాబాద్‌, మంచిర్యాలలో విద్యాలయాలు

బజార్‌హత్నూర్‌: కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి బాల వాటిక 1, 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్‌ 2న రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, మంచిర్యాలలో విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఆర్మీ, అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలతో పాటు విద్యాహక్కు చట్టం కింద కూడా ఇతర పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. రెండు సెక్షన్‌లలో 40 మంది విద్యార్థుల చొప్పున 80 మందికి ప్రవేశం కల్పిస్తారు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధన ఉంటుంది. తరగతి1లో అడ్మిషన్‌ పొందే విద్యార్థి 2026 మార్చి 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ళ వయస్సు కలిగి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వరకు సడలింపు ఉంటుంది. అర్హులైన విద్యార్థులు kvsonline admission.kvs.gov.in లేదా kvssangathan. nic.in వెబ్‌సైట్‌ ద్వారా లాగిన్‌ కావాలి. బాలవాటిక 2, బాలవాటిక 3, రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొదటి మెరిట్‌ లిస్ట్‌ (బాలవాటిక)

:ఏప్రిల్‌ 08, 2026

మొదటి మెరిట్‌ లిస్టు (1వ తరగతి)

:ఏప్రిల్‌ 09, 2026

రెండో మెరిట్‌ లిస్టు:ఏప్రిల్‌ 16, 2026

మూడో మెరిట్‌ లిస్టు:ఏప్రిల్‌ 21, 2026

బాలవాటిక 2, 3, రెండోతరగతి,

ఆపైన ఎంపిక లిస్ట్‌:ఏప్రిల్‌ 13

బాలవాటిక 2, 3, తరగతులు 2,

ఆపైన ప్రవేశాలు: ఏప్రిల్‌ 15 నుంచి 20

ఒకవేళ మొదటి నోటిఫికేషన్‌లో అనుకున్న

సంఖ్యలో రాకపోతే రెండో నోటిఫికేషన్‌ జారీ చేసి ఏప్రిల్‌ 22 నుంచి 26 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని తరగతులకు ప్రవేశానికి చివరితేదీ జూన్‌ 30.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement