రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Mar 20 2026 8:23 AM | Updated on Mar 20 2026 8:23 AM

నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లింగాల సత్యనారాయణ గౌడ్‌ (65) బుధవారం రాత్రి బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ నివాసం సమీపంలో నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఇచ్చోడ నుంచి నిర్మల్‌ వైపు అతివేగంగా వెళ్తున్న ఐచర్‌ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో 108లో క్షతగాత్రుడిని బోథ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమారుడు లింగాల సంతోష్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సయ్యద్‌ ఇమ్రాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement