ప్రవాసీల పద్దు ఎంత..? | - | Sakshi
Sakshi News home page

ప్రవాసీల పద్దు ఎంత..?

Mar 20 2026 8:23 AM | Updated on Mar 20 2026 8:23 AM

● గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేక నిధుల డిమాండ్‌ ● ఉమ్మడి జిల్లాలో 72 వేలమంది.. ● కేటాయింపులకోసం ఎదురుచూపులు

నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సమస్యలు రో జురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్‌, జన్నారం, ఖానాపూర్‌, భైంసా, ఆదిలాబాద్‌, ఇచ్చోడ, బోథ్‌, గుడిహత్నూర్‌, లక్సెట్టిపేట్‌, మంచిర్యాల, మందమర్రి, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు దుబాయ్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, బహ్రెయిన్‌ వంటి ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 72 వేలకుపైగా గల్ఫ్‌ కార్మికులు ఉన్నట్లు అంచనా. ఉపాధి కోసం విదేశాల బాట పట్టిన యువకులు అక్కడ అనేక కష్టాలు ఎదుర్కొంటుండగా, వారి కుటుంబాలు ఇక్కడ ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి.

జీవితాలు దుర్భరం..

అవగాహన లోపం, ఏజెంట్ల మోసాలకు గురికావడం వల్ల చాలామంది యువకులు విదేశాలకు వెళ్లిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్య రహిత పనులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, భాషా సమస్యలు, తక్కువ వేతనాలు వంటి కారణాలతో వారు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

మృతదేహాల రాకలో ఆలస్యం

గల్ఫ్‌ దేశాల్లో అనారోగ్యం లేదా ప్రమాదాల వల్ల మరణించిన కార్మికుల మృతదేహా లు స్వదేశానికి చేరుకోవడానికి నెలల తరబడి ఆలస్యం కావ డం హృదయ విదా రక పరిస్థితులను సృష్టిస్తోంది. కుటుంబ సభ్యులు కడసారి చూపు కోసం కూడా ఎదురు చూడాల్సి వ స్తోంది. ఈ ప్రక్రియలో గల్ఫ్‌ కార్మిక సంఘాలు, భా రత రాయబార కార్యాలయాలు సమన్వయం చేస్తు న్నా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం లేదు.

సంక్షేమ పథకాల అవసరం

గల్ఫ్‌ కార్మికులు లేదా అక్కడే మరణించిన వారి కుటుంబాలకు అందుతున్న ఆర్థికసాయం పరిమితంగా ఉందని విమర్శలు ఉన్నాయి. బాధిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, ఆరోగ్య భద్రత, పింఛన్‌ వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. తిరిగి వచ్చిన కార్మికులకు పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యేక పద్దుకు విజ్ఞప్తి చేశాం..

గల్ఫ్‌ కార్మికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, వారి కుటుంబాల దీనస్థితిని వివరిస్తూ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరపాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, రాష్ట్ర ఎన్నారై అడ్వైజరి కమిటీ వైస్‌ చైర్మన్‌ మందా భీమ్‌రెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్‌లతో కూడిన బృందంతో మంత్రిని కలిశాం. బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.

– స్వదేశ్‌ పరికిపండ్ల, రాష్ట్ర ఎన్నారై కమిటీ సభ్యుడు, నిర్మల్‌

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన రాజుల పోతన్న (51). ఇతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సౌదీ అరేబియా వెళ్లి ఈ నెల 14న అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అక్కడికి వెళ్లడానికి, కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీరక మరోవైపు కుటుంబ యజమాని విగత జీవిగా మారడం భార్యాపిల్లల్లో తీవ్ర విషాదం నింపింది. కనీసం కడచూపు కోసం తన భర్త మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని భార్య నర్సమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

ఇటీవల రాష్ట్ర ఎన్నారై కమిటీ సభ్యులు నిర్మల్‌జిల్లాలోని సారంగాపూర్‌ మండలంలో పలు గ్రామాలను సందర్శించి గల్ఫ్‌ బాధిత కుటుంబాల పరిస్థితిని అధ్యయనం చేశారు. బాధితుల సమస్యలు, అవసరాలను గుర్తించి సమగ్ర నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement