దండేపల్లి: యాప్ ద్వారానే యూరియా పొందాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొందరు రైతులు స్మార్ట్‌ఫోన్లు లేక.. మరికొందరికి ఉన్నా ఎలా బుక్ చేయాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం యాసంగిలో రైతులు మొక్కజొన్న, వరి తదితర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం యూరియా అవసరం ఉండడంతో వచ్చిందని తెలియగానే రైతులు ఫర్టిలైజర్ దుకాణాలు, సహకార సంఘాల వద్దకు వెళ్తున్నారు. గతంలో మాదిరిగా ఆధార్ వివరాలతో కాకుండా ముందుగానే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో బుక్ చేసుకోవాలి.. ఇది ఇప్పటికీ కొందరు రైతులకు తెలియక నేరుగా వెళ్లి యూరియా అడుగుతున్నారు. తెలియని రైతులకు సహకార సంఘం కార్యాలయాల వద్ద సిబ్బంది, ఫర్టిలైజర్ దుకాణాల వద్ద వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉండి అప్పటికప్పుడు బుక్ చేసి అందిస్తున్నారు. కొందరు యాప్‌లో బుక్ చేయడం తెలిసిన వారిని బతిమాలి చేయిస్తున్నారు. యాప్‌లో బుక్ చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉందని రైతులు వాపోతున్నారు. స్టాక్ వచ్చిందని తెలియగానే తెలిసిన వారంతా యాప్‌లో బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేయడం తెలియని వృద్ధులు, నిరక్షరాస్యులు, ఫోన్ ఉండి బుక్ చేయడం రాని వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ విషయంలో కొంత సడలింపు ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.
అవగాహన కల్పించాం..
యూరియా కోసం ఫర్టిలైజర్ యాప్ బుకింగ్‌పై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించాం. ఇంకా తెలియని రైతులు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవోలను అందుబాటులో ఉంచి తెలియని యాప్‌లో బుకింగ్ చేసి యూరియా అందిస్తున్నాం.
– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో యాసంగి సాగు వివరాలు..
వరి సాగు 1,17,636
మొక్క జొన్న 6,816


