వ్యాకరణ అంశాలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

వ్యాకరణ అంశాలపై దృష్టి

Mar 4 2026 7:22 AM | Updated on Mar 4 2026 7:22 AM

తెలుగు ప్రశ్న పత్రాన్ని సామర్థ్యాల వారీగా విభజించుకుని అవగాహన చేసుకోవాలి. వ్యాకరణ అంశాలపై దృష్టి పెట్టాలి. సంధులు వాటి సూత్రాలు, సమాసాలు వాటి విగ్రహ వాక్యాలు రాయడంలో విభక్తులను గమనించాలి. చందస్సు, అలంకారాలు, వాక్యాలు రాయడంపై సాధన చేయాలి. వాక్యాల్లో సామాన్య, సంయుక్త సంశ్లిష్ట, పరోక్ష, ప్రత్య వాక్యాల్లో తేడాలని గుర్తించాలి. వాక్యనిర్మాణం, అక్షర దోషాలు లేకుండా చూడటం, చక్కని పదజాలం వల్ల పూర్తి మార్కులు సాధిస్తారు.

– జనార్దన్‌, తెలుగు ఉపాధ్యాయుడు

చేతిరాతతో ఎక్కువ మార్కులు

హిందీ పదాలు తప్పులు లేకుండా రాయడంతో పాటు చక్కని చేతి రాతతో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఆధునిక పద్యాన్ని బాగా చదవాలి. కవి పరిచయాన్ని సరళమైన రూపంలో గుర్తుంచుకోవాలి. భాష, వ్యాకరణాన్ని అర్థం చేసుకోవాలి. పాఠం ప్రధాన అంశాన్ని తెలుసుకోవాలి. సాధన చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

– నీలేష్‌, హిందీ ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement