మాజీ మావోయిస్టు దంపతులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టు దంపతులకు సన్మానం

Mar 2 2026 8:22 AM | Updated on Mar 2 2026 8:22 AM

మాజీ మావోయిస్టు దంపతులకు సన్మానం

మాజీ మావోయిస్టు దంపతులకు సన్మానం

మందమర్రిరూరల్‌: మాజీ మావోయిస్టు రాష్ట్ర కమి టీ సభ్యులు, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మా జీ కార్యదర్శి బండి ప్రకాశ్‌ అలియాస్‌ బండిదాదా–హేమ, మాజీ మావోయిస్ట్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు (టెక్నికల్‌ విభాగం) అప్పాసి నారాయణ–లక్ష్మీ దంపతులను పట్టణ మిత్రబృందం ఆధ్వర్యంలో సన్మానించారు. పట్టణంలోని సీఈఆర్‌ క్లబ్‌ ఆవరణలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వారికి డప్పు కొడుతూ వారికి స్వాగతం పలికారు. రాష్ట్ర కనీస వేతనాల మండలి కమిటీ చైర్మన్‌, ఐఎన్టీయూసీ జనరల్‌ సెక్రెటరీ జనక్‌ప్రసాద్‌, మాజీమంత్రి బో డ జనార్దన్‌, కార్మిక నేత కెంగర్ల మల్లయ్య తదితరులు హాజరై మాజీ మావోయిస్ట్‌ దంపతులను పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. రా జ్యాంగ పుస్తకాన్ని వారికి అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బండి ప్రకాశ్‌, అప్పాసి నారాయణ.. మూడు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపి ప్రజల్లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో అసమానతలు ఉన్నంత కా లం మావోయిజం ఉంటుందని, అనారోగ్యంతో అ జ్ఞాతం వీడానని బండి ప్రకాశ్‌ తెలిపారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపర్చి ప్రా ణం ఉన్నంత వరకు చట్ట బద్ధంగా పోరాటం చేస్తానన్నారు. మిత్రబృందం సభ్యులు రవీందర్‌, కాంపెల్లి సమ్మయ్య, సత్యం, రాజశేఖర్‌, రవీందర్‌రావు, వజీర్‌ సుల్తాన్‌, రాజమల్లు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement