వడ్రంగి నైపుణ్యంలో జిల్లావాసి ప్రతిభ
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన యెర్రం శ్రీరామ్ ఇటీవల నిర్వహించిన జాతీయ వేదికలో తెలంగాణ తరపున వడ్రంగి నైపుణ్యంలో ప్రతిభ కనబర్చాడు. హైదరాబాద్‌లోని శాంతివనంలో దేశంలోని రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 350 మంది విద్యార్థులు జాతీయ వేదికలో పాల్గొనగా, తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన శ్రీరాం తన ప్రతిభను చాటారు. రాష్ట్రమంత్రి వివేక్ వెంకటస్వామి అతన్ని అభినందించారు. తనకు మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వై.రమేశ్, సీహెచ్ శ్రీధర్‌రాజులు తగిన ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు శ్రీరాం తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన బైక్..
ఇద్దరు మృతి
ఇంద్రవెల్లి: మండలంలోని దనొరా(బి) సమీప ంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కుమురం భీమ్ కాలనీ సమీపంలో 170 కాలనీకి చెందిన ఆడ విజయ్(22), ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామానికి చెందిన వరుసకు చిన్నమ్మ నైతం జంగుబాయి(55)తో కలిసి బైక్‌పై ఆదివారం సాలేవాడ గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలో అదుపు తప్పి చెట్టు ను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వడ్రంగి నైపుణ్యంలో జిల్లావాసి ప్రతిభ
వడ్రంగి నైపుణ్యంలో జిల్లావాసి ప్రతిభ


