సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ
బాసర: సీఎం కప్ క్రీడాపోటీల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఖమ్మంలో ఆర్చరీ (విలువిద్య) అండర్–19 విభా గంలో హన్సిక ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలి చింది. బంగారు పతకం కై వసం చేసుకుంది. హై దరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ అండర్–19 విభాగంలో జాహ్నవి తృతీయ స్థా నం దక్కించుకుని కాంస్య పతకం పొందింది. పతకాలు సాధించిన విద్యార్థినులను వీసీ, ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ అభిన ందించారు. స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి రామకృష్ణ, అసోసియేట్ డీన్ విఠల్, ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు రామరాజు,సాయి, పీడీ శ్యాంబాబు, రవికిరణ్, వసంత, స్వప్న వారిని అభినందలు తెలిపారు.


