రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
జన్నారం: హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఫిజికల్ సైన్స్ రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్‌లో జన్నారం మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఏ.అనన్య ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతి సాధించినట్లు హెచ్‌ఎం గుండ రాజన్న తెలిపారు. విద్యార్థినితో పాటు గైడ్ టీచర్ కొట్టె రాజన్నను అభినందిస్తూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ మెమొంటో, సర్టిఫికెట్‌తో పాటు రూ.3 వేల నగదు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం విద్యార్థిని, గైడ్ టీచర్‌ను జన్నారం ఫారెస్ట్ డివిజన్ అధికారి రాంమోహన్, సర్పంచ్ వాసాల నరేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మంగ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


