రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌కు ఘనస్వాగతం | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌కు ఘనస్వాగతం

Mar 2 2026 7:35 AM | Updated on Mar 2 2026 7:35 AM

రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌కు ఘనస్వాగతం

రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌కు ఘనస్వాగతం

జన్నారం: ఆర్మీ జవాన్‌గా పదహారేళ్లపాటు దేశానికి సేవలందించి రిటైర్డ్‌ అయి స్వగ్రామానికి వచ్చిన గోనె ప్రభాకర్‌కు ఆదివారం మండల కేంద్రంలో ఘనస్వాగతం పలికారు. బస్టాండ్‌ నుంచి డీజే చప్పుళ్ల మధ్య టపాసులు కాలుస్తూ ఓపెన్‌టాప్‌ జీపుపై ర్యాలీగా తరలివచ్చారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు సిటుమల్ల భరత్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముజాఫర్‌ అలీఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement